లాక్‌ డౌన్‌పై నడుస్తున్న బెట్టింగ్‌లు..మే 2 నుండి లాక్ డౌన్ ఉంటుందని భారీగా బెట్టింగ్ లు

క్రికెట్ మ్యాచ్ లు,ఎలక్షన్ రిజల్ట్ మీద పందాలు కట్టడం సాధరణ విషయం..కాలంతో పాటు ట్రెండ్ మార్చారు పందం రాయుళ్లు. ఒక పక్క కోవిడ్ కేసులతో జనాలు అల్లాడుతుంటే బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఎలాంటి పరిస్థితినైనా క్యాష్‌ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జనాల్లో ఉన్న వీక్‌ నెస్‌ను ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్నారు బుకీలు.

ఎన్నికలు అవ్వొచ్చు క్రికెట్‌ మ్యాచ్‌ కావొచ్చు బుకీల వద్ద పక్కా సమాచారం ఉంటుంది. వందల, వేల కోట్ల బెట్టింగ్‌ జరిగే బుకీల వద్ద చాలా తాజా సమాచారం ఉంటుంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో కచ్చితంగా చెప్పేస్తారు. ఫెయిల్యూర్‌ రిపోర్ట్‌ చాలా తక్కువ. ఇప్పుడు వీరి కన్ను లాక్‌డౌన్‌ మీదపడింది. మే నెల నుంచి లాక్‌ డౌన్‌ ఉంటుందో లేదో అనే అంశం పై కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు.

దేశంలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. పరిస్థితి చూస్తే ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదు. వ్యాక్సిన్‌ సరఫరా కూడా డిమాండ్‌కు తగ్గట్లు లేదు. దీంతో ఈ నెలాఖరులో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని బుకీలు అంచనా వేస్తున్నారు. మే తొలివారంలో లాక్‌డౌన్‌ ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని బుకీల వద్ద ఉన్న సమాచారం. జనాల వీక్‌ నెస్‌ను క్యాష్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు బుకీలు.

మే మొదటివారంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌కు ఛాన్స్‌ ఉందంటూ బెట్టింగ్‌లు వేస్తున్నారు. మూడు నుంచి నాలుగు వారాల లాక్‌డౌన్‌ కచ్చితంగా ఉంటుందని బుకీలు బల్లగుద్ది మరి చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad