10వ తరగతి / ఇంటర్ పరీక్షలు పై మంత్రి గారి తాజా ప్రెస్ మీట్ (22.04.2021) వివరాలు

 10పరీక్షల రద్దు ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం 


ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనీ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల రద్దుపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన రాజకీయ పార్టీలు వారి భవిశ్యత్ ను కాలరాస్తున్నాయని విమర్శించారు. పరీక్షలు రద్దు చెయ్యాలని కోరుతున్న నారా లోకేష్.. చదువు విలువ తెలిసిన వారైతే ఈ విధంగా మాట్లాడేవారు కాదని అన్నారు.

   సినిమా ప్రమోషన్ కు రాజకీయ సభను వాడుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పరీక్షలను రద్దు చెయ్యాలని కోరడం విడ్డురంగా ఉందని సురేష్ అన్నారు. పరీక్షల రద్దుపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

కరోనాతో పాటు విద్యార్థుల భవిశ్యత్ కూడా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి గారితో చర్చించిన తరువాత ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇప్పటికే 90 శాతం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయ్యాయని మరో రెండు రోజులలో ప్రాక్టికల్స్ పూర్తవుతాయని అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని రాజకీయం చేసే రీతిలో నారా లోకేశ్ వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు. ఆయన వాస్తవాలు తెలుసుకుని రాజకీయం చేయాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad