కర్నూలు విద్య, న్యూస్ టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహిం చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్య క్షుడు హెచ్. తిమ్మన్న అన్నారు. కర్నూలు సలాం ఖాన్ భవనంలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 2018 PRC ని
తక్షణమే 30 శాతం ఫిట్మెంట్ తో ఆమోదించి అమలు చేయాలని కోరారు. కేజీబీవీలో పనిచే స్తున్న ఉపాధ్యాయులకు ఎంటీఎస్ వర్తింపజేయాల న్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఇంట ర్లో ప్లస్ టూ విద్యను అమలుచేసి అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాల న్నారు. ఎంఎండీ షఫీ, జి.గోవిందు, శేఖర్, కృష్ణ మూర్తి వి. రాముడు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.