దేశంలో CARONA మలిదశ సంకేతాలు..?


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. గత రెండున్నర నెలల తర్వాత శనివారం అత్యధికంగా 24,882 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా మలిదశ ప్రారంభమైందని, మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 67 శాతం వరకు కరోనా కేసులు పెరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఎక్కువ మంది కరోనా వ్యాక్సిన్ అందజేయాలని, నిబంధనలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూసుకోవాలని సీఎస్ఐఆర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.

దేశంలో 85.91 శాతం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. ఈ మేరకు ఆయన కొత్త వైరస్‌ల వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయా.. లేదా ప్రజల అజాగ్రత్త వల్ల కేసుల సంఖ్య పెరుగుతుందా అనే విషయంపై పరిశోధిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు మరోసారి కొనసాగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మరో కొత్త వైరస్‌లు దేశంలో పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎస్ఐఆర్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ప్రజల అజాగ్రత్తగా అనిపిస్తోందని, కరోనా నిబంధనలు పాటించకపోవడమే కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో కరోనా తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు అప్రమ్తంగా ఉండి.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని, మరికొందరిలో వ్యాక్సిన్‌పై భయం ఉందని.. వారి తొలగించాల్సిన అవసరం ఉందని సీఎస్ఐఆర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ వైరాలజీ నిపుణురాలు ఉపాసన రే పేర్కొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 216 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఏపీలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు ప్రాణాలు విడిచారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad