Friday, March 5, 2021

8న మొబైల్స్‌ కొనుగోలుపై 10% రాయితీ 8న మొబైల్స్‌ కొనుగోలుపై 10% రాయితీ
అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా వైద్య పరీక్షలు 
మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు సెలవులు 
‘దిశ’పై అవగాహనకు విస్తృతంగా ప్రచారం 
అంగన్‌వాడీ భవనాల నిర్మాణం సత్వరం పూర్తి 
విద్యార్థులకు ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీలు: సీఎం
రోజుకు ఒక పదం చొప్పున నేర్చుకునేలా చర్యలు: సీఎం జగన్‌ 
అంగన్‌వాడీల్లో నాడు-నేడు, మహిళా దినోత్సవంపై సమీక్ష 

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి, ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో 8న మొబైల్‌ ఫోను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’పై అవగాహన పెంచేలా హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, దీనిపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం సాగాలని సూచించారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడు, మహిళా దినోత్సవం ఏర్పాట్లపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిలిం పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి విభాగం నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సత్కరించాలన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించారు.

అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్‌ చెకప్‌, మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవులు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మహిళా దినోత్సవం ముందురోజు 7న రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీ చేపట్టాలన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంచేందుకు సెర్ప్‌, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఎంఓయూ చేసుకోవాలన్నారు. టెన్త్‌ పూర్తయిన బాలికలు ప్లస్‌-1, ఫ్లస్‌-2లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 44,119 అంగన్‌వాడీ భవనాల అభివృద్ధి, కొత్తవాటి నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏకకాలంలో పనులు ప్రారంభం కావాలన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు ఇంగ్లీషు, తెలుగు డిక్షనరీలు ఇవ్వాలని సూచించారు.

పిల్లలు రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలన్నారు. ఇదే తరహాలో అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో ప్రీప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను మహిళా శిశు సంక్షేమాధికారులు ప్రదర్శించగా సీఎం వాటిని పరిశీలించారు. వైఎ్‌సఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతలపై నిర్దేశించిన విధి విధానాలతో ఎస్‌ఓపీ బుక్‌ను అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top