Wednesday, February 24, 2021

1-7 తరగతులకు CBSE సిలబస్ :విద్యా శాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాద్‌ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్‌ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరు 

ఈ సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...

 1-7 తరగతులకు CBSE సిలబస్

2021– 22 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం  తర్వాత తరగతులుకు ఒక్కో ఏడాదీ అమలు 2024 విద్యాసంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోకి 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈసీ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ పనులు, విద్యాకానుకపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. విద్యాకానుకలో ఇంగ్లీష్‌, తెలుగు డిక్షనరీలను చేర్చాలని.. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు. 

తొలి విడత నాడు-నేడు పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడెక్కడ  పనులు పెండింగ్‌లో ఉన్నాయనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటిని పూర్తిచేయాలన్నారు. పాఠశాలలు మంచి డిజైన్లతో ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల్లో రాజీ పడొద్దని.. పనులు పూర్తయిన నిర్మాణాల ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. రెండో దశ పనులను కూడా సత్వరమే ప్రారంభించాలని.. తొలిదశలో ఎదురైన ఇబ్బందులను అధిగమించాలని అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు

మన బడి నాడు – నేడు

మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలి – స్కూళ్ళు మంచి కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలి – సనాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూల్స్‌ ఫొటోలు పరిశీలించిన సీఎం . స్కూళ్ళలో ఇంటీరియర్‌ కూడా బావుండాలి

రెండో దశ నాడు – నేడు పనులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

సెకండ్‌ ఫేజ్‌లో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి , పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు :నాణ్యతకు పెద్దపీట వేయాలి: పనుల్లో నాణ్యత లేకపోతే సీరియస్‌గా తీసుకోవాలి: మనసా వాచా కర్మణ మనం కమిటెడ్‌గా పనిచేయాలి అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం టేబుల్స్‌ విషయంలో మరింత జాగ్రత్త అవసరం, టేబుల్స్‌ హైట్‌ కూడా చూసుకోవాలి 

పక్కా భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు:

ఎక్కడైతే భవనాలు లేవో.. అక్కడ కచ్చితంగా భవనాలు కట్టించాలి:

నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలి:

రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి సీఎం ఆదేశాలు

పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత

స్కూళ్లలో టాయిలెట్ల శుభ్రతపై సీఎం సమీక్ష ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామన్న అధికారులు మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్‌ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు

విద్యార్ధుల హాజరు

విద్యార్ధుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోందని అధికారులు వెల్లడి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు మార్చి  15కల్లా పూర్తిచేస్తామన్న అధికారులు

విద్యాకానుకపై 

విద్యాకానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలని , విద్యాకానుకలో కిట్‌లో ఈసారి తప్పనిసరిగా డిక్షనరీ ఉండాలని, క్వాలిటీ కూడా బాగుండాలని సీఎం ఆదేశాలు

అలాగే పాఠ్యపుస్తకాలు కూడా క్వాలిటీగా ఉండాలన్న సీఎం

ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలని , విద్యాకానుకలో ఏది చూసినా... కూడా క్వాలిటీ ఉండాలని ,ఎక్కడా కూడా రాజీపడొద్దన్న సీఎం

టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలన్న సీఎం

అమ్మ ఒడి కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యం

అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ

అంగన్‌ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్న CM శ్రీ వైఎస్‌ జగన్‌ 

చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న దానిపై శిక్షణ అలాగే టీచర్లకు కూడా శిక్షణ కొనసాగాలన్న సీఎం ,ప్రతి రెండు నెలలకోసారి వారు ఎంతవరకు నేర్చుకున్నారన్నదానిపై ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలన్న సీఎం ,పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎంతవరకు శిక్షణ కార్యక్రమాలద్వారా అప్‌గ్రేడ్‌ అయ్యారో పరిశీలించి, మరింతగా వారికి ట్రైనింగ్‌ ఇవ్వాలన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ .


SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING

✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top