అమ్మ ఒడి అర్జీల పరిష్కారానికి నేడే తుది గడువు

ammavodi-new-logo
ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 10: అమ్మఒడి ఆర్థిక సాయం అందని తల్లిదం డ్రుల నుంచి సచివాలయాల ద్వారా అందిన అర్జీల్లో తుది అర్హుల ఎంపిక గురువారంతో ముగియనుంది. అనర్హతకు చూపించిన ఆరు రకాల నిబంధనల (సిక్స్‌ స్టెప్‌ వేలిడేషన్‌)కు సంబంధించి 1740 అర్జీలు, జాయింట్‌ కలెక్టర్‌కు అందిన 348 అర్జీలతోపాటు, ఇప్పటికే అర్హత సాధించిన తల్లుల బ్యాంకు ఖాతాల్లో తప్పుల దిద్దుబాటుకు సంబంధించి 1804 ఖాతాల వివరాల అప్‌డేషన్‌ను పరిష్కరించడానికి స్కూల్‌ హెచ్‌ఎంల లాగిన్‌లకు విద్యా శాఖ పంపింది. వీటిని పరిశీలించి అర్హత/అనర్హతలను గురువారం సాయంత్రంలోగా అమ్మఒడి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. 

ఈ అభ్యంతరాలకు ఇకపై అవకాశం లేదని తేల్చి చెప్పారు. తుదిగా ఎంపికైన లబ్ధిదారుల(తల్లుల) వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌డేట్‌ చేసిన వెంటనే రూ.14 వేల నగదును సంబంధిత తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి సీనియర్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల్లో మొత్తం 5,52,783 మందిని అమ్మఒడికి అర్హులుగా గుర్తించి 3,55,051 మంది తల్లులకు రూ.532 కోట్ల ఆర్థిక సాయాన్ని గత నెల 11న అందజేశారు. సిక్స్‌ స్టెప్‌ వేలిడేషన్‌, తదితర కారణాల వల్ల 76,993 మంది అనర్హులైనట్లుగా విద్యా శాఖ ప్రకటించింది. అనర్హుల నుంచి అభ్యంతరాలపై అర్జీలను కోరగా సచివాలయాలకు 2,080 వచ్చాయి. దీంతో అనర్హులుగా నిర్ధారించిన మిగతా విద్యార్థులకు అమ్మ ఒడికి అర్హత లేనట్లు విద్యా శాఖ తుది నిర్ణయానికి వచ్చింది.

Update Ammavodi 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad