తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో నెలనెలా 30 శాతం కట్

EMPLOYEES-SALARY-CUT

తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో30% Pay కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ రాహుల్ బోండ్రే తెలిపారు. మొత్తం 12మంది ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని…అయితే ఈ 12మందిలో ఆరుగురు టీచర్లు అని రాహుల్ బోండ్రే తెలిపారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన డబ్బును వారి తల్లిదండ్రుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయనున్నట్లు తెలిపారు.

 కాగా,తల్లిదండ్రులను పట్టించుకోని అందరి ఉద్యోగుల జీతాల్లో 30శాతం కోత విధించాలని గతేడాది నవంబర్ లో లతుర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీ ఓ తీర్మాణాన్ని పాస్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్-2020నుంచే ఈ జీతాల కోతలు ప్రారంభైనట్లు రాహుల్ బోండ్రే చెప్పారు. ప్రతి నెలా 30శాతం జీతం కోత కంటిన్యూ అవుతుందని.. ఒక్కో కేసులో సగటున 15వేల వరకు కోత ఉంటుందని తెలిపారు. అయితే కొన్ని కేసుల విషయంలో..తాము ఉద్యోగులకు నోటీసులు పంపిన తర్వాత ఉద్యోగులు మరియు వారి తల్లిదండ్రుల మద్య సఖ్యత కుదిరి పరిష్కరించబడ్డాయని తెలిపారు.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad