Saturday, December 12, 2020

Technical Problems for Web Options


తొలి రోజే సాంకేతిక సమస్యలు

సక్రమంగా పనిచేయని సర్వర్‌

అన్ని క్యాడర్లకు లింకు రాకపోవటంతో ఆందోళన

లింకులు అన్నీ  శనివారం కల్లా పూర్తిస్థాయిలోకి తీసుకొచ్చే చర్యలు ప్రారంభం

ఉపాధ్యాయబదిలీ వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం

ఉపాధ్యాయ బదిలీల వెబ్‌ కౌన్సెలింగ్‌ విధాన ప్రక్రియలో ఐచ్ఛికాల నమోదుకు ప్రభుత్వం శుక్రవారం వెబ్‌లింకును అందుబాటులోకి తీసుకొచ్చింది. 

బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుని ఈనెల 15లోపు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలని సూచించింది. వాటి ఎంపికలో ఉపాధ్యాయులకు పరిమితులు లేవు. ఎన్ని ఖాళీలు అయినా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది.

ఆప్షన్ల నమోదులో మొదటి రోజే ఉపాధ్యాయులకు అసౌకర్యం ఏర్పడింది. కొద్దిసేపు సర్వర్‌ పనిచేయలేదు. అనంతరం పునరుద్ధరించినా అన్ని కేటగిరీలకు సంబంధించిన ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వలేదు.

కేవలం గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు సంబంధించిన లింకు మాత్రమే ఇవ్వటంతో మిగిలిన వారు ఆందోళన చెందారు.

 గ్రేడ్‌-2 ఉపాధ్యాయులకు ఇచ్చిన లింకు సవ్యంగా పనిచేయలేదు. వారు ఆప్షన్లు ఇచ్చుకోవటానికి ప్రయత్నిరచగా అందులో క్లియర్‌ వేకెన్సీలు, హేతుబద్ధీకరణ వేకెన్సీలకు బదులు పదోన్నతుల పొందిన వారి ఖాళీలు మాత్రమే డిస్‌ప్లే కావటంతో అయోమయానికి గురయ్యారు. 

వెబ్‌సైట్‌లో ఏ ఆప్షన్‌ నొక్కినా ప్రమోటీ ఖాళీలు మాత్రమే డిస్‌ప్లే అయ్యాయని గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు తెలిపారు. తొలిరోజే ఉపాధ్యాయులకు చుక్కలు కనిపించాయి.

ఉదయం తెరుచుకోవాల్సిన సైట్‌ సాయంత్రానికి తెరుచుకుంది. అది కూడా తప్పులు తడకగా ఉండటంతో తాము 15లోపు ఐచ్ఛికాలు ఎలా నమోదు చేసుకోగలమని ఉపాధ్యాయవర్గం లబోదిబోమంటోంది. 

మొత్తానికి ఉపాధ్యాయులకు ఏర్పడిన అసౌకర్యాన్ని జిల్లా విద్యాశాఖ యంత్రాంగం, సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో రాత్రికి సమస్యలను పరిష్కరించి సైట్‌లో అన్ని రకాల ఖాళీలు చూపేలా పునరుద్ధరించటంతో ఊపిరి పీల్చుకున్నారు. 

స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, వ్యాయామోపాధ్యాయులు ఐచ్చికాలు ఇచ్చుకోవటానికి వీలుగా వాటికి సంబంధించిన లింకులను శనివారం కల్లా పూర్తిస్థాయిలోకి తీసుకొచ్చే చర్యలు ముమ్మరమయ్యాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

అవే ఖాళీలు....

ఉపాధ్యాయులు కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని క్యాడర్లలో ప్రదర్శించిన ఖాళీలకు సంబంధించి ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 

గతంలో బ్లాక్‌డ్‌ ఖాళీలతో ఏదైతే జాబితా ప్రదర్శించారో దానినే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రధానోపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఐదు అకడమిక్‌ సంవత్సరాలు పనిచేస్తే వారిని నిర్బంధ బదిలీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఇంటీరియమ్‌ ఆర్డరు ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో బదిలీలు ఏ మేరకు జరుగుతాయో వేచి చూడాల్సిందేనని ఉపాధ్యాయవర్గం అంటోంది.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

DONWLOAD TRANSFR ORDERS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top