ఎట్టకేలకు టీచర్ల ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా

 జిల్లా నుంచి 7,449 దరఖాస్తులు

ఆర్జేడీ, డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ స్థాయిల్లో 56 తిరస్కరణ

అనంతపురం విద్య, డిసెంబరు 3: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాను గురువారం ఎట్టకేలకు ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల జాబితాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (సీఎ్‌సఈ) వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. జిల్లా జాబితాను రాత్రి ఆలస్యంగా ఉంచారు. జిల్లా నుంచి మొత్తం బదిలీలకు 7,449 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆర్జేడీ, డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ స్థాయిల్లో 56 దరఖాస్తులను తిరస్కరించారు. నేటి నుంచి రెండు రోజులపాటు ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఆమోదం తీసుకుని, తుది జాబితాను ప్రదర్శించనున్నారు.

తేలిన లెక్క

జిల్లాల నుంచి జాబితాలను రాష్ట్ర శాఖకు పంపా రు. దీంతో వారు జిల్లాల వారీగా జాబితాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలకు 7,449 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు సంబంధించి 188, స్కూల్‌ అసిస్టెంట్‌ తదితరాలు 7,210 ఉన్నాయి. రెండేళ్ల సర్వీసు పూర్తికాని, పీఈటీలవి, అనర్హత తదితర కారణాలతో ఆర్జేడీ 1, డీఈఓ 4, డిప్యూటీ డీఈఓలు 18, ఎంఈఓలు 33 దరఖాస్తులను తిరస్కరించినట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మరో ఐదుగురి దరఖాస్తులను తి రస్కరించటంతో తిరిగి దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతున్నారు.

సాంకేతిక సమస్యతో జాప్యం

జిల్లా ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో కనిపించలేదు. ఇతర జిల్లాల జాబితాలు కనిపించినా.. అనంతకు సంబంధించి కనిపించకలేదు. మధ్యాహ్నం నుంచే బదిలీల సీనియారిటీ జాబితాలు అంటూ.. కొన్ని కేటగిరీ పోస్టుల జాబితాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. సాంకేతిక సమస్యలతో జిల్లా జాబితా వెబ్‌సైట్‌లో ప్రదర్శించలేదు. సమస్య పరిష్కారం తర్వాత ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితాను ప్రదర్శించారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad