గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి సూచనలు . ఈరోజు నుంచి 4 కొత్త రూల్స్ అమలులోకి

New LPG Cylinder Rules form November 1st :

గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని యోచిస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారుతున్నాయి. 4 అంశాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

గ్యాస్ సిలిండర్ రూల్స్ మార్పు

కొత్త నిబంధరలు అమలులోకి

కస్టమర్లపై ఎఫెక్ట్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్. కొత్త నెల రావడంతోనే కొత్త రూల్స్‌ తీసుకువచ్చింది. గ్యా్స్ సిలిండర్ వినియోగానికి సంబంధించి పలు నిబంధనలు మారుతున్నాయి. ఇవి ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో గ్యా్స్ సిలిండర్ కలిగిన వారు ఈ రూల్స్ ఏంటివో కచ్చితంగా తెలుసుకోవాలి.

1. గ్యాస్ సిలిండర్ డెలివరీ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ ఓటీపీ చెబితేనే మీకు సిలిండర్ డెలివరీ చేస్తారు.

2. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, లేదంటే అడ్రస్ తప్పుగా ఉన్న వారు వెంటనే వాటిని అప్‌డేట్ చేసుకోవడం మంచిది. లేదంటే సిలిండర్ డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్లను అప్‌డేట్ చేసుకోవాలని ఆయిల్ కంపెనీలు కస్టమర్లను కోరుతున్నాయి. లేదంటే సిలిండర్ ఆగిపోతుంది.

3. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కంపెనీ బుకింగ్ నెంబర్‌ను మార్చేసింది. ఇదివరకు కంపెనీకి గ్యాస్ బుకింగ్‌కు ఒక్కో సర్కిల్‌లో ఒక్కో నెంబర్ ఉండేది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు 7718955555 నెంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

4. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీ మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే నవంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉండొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad