Saturday, October 31, 2020

ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు, ధర ఎంతంటేబంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో గంటలు గంటలు జామ్ అయ్యే సమస్యలకు చెక్ పెట్టేలా ఇపుడు ఎగిరే కార్లు రయ్ మంటూ దూసుకురానున్నాయి.  దీంతో ఇక హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ లాగా రెక్కలు తొడుక్కున్న కార్లతో అలా గాల్లోకి ఎగిరిపోవచ్చన్నమాట. ప్రపంచంలోని మొట్టమొదటి   కమర్షియల్ ఫ్లయింగ్ కారు ఎగిరే కారు నెదర్లాండ్స్ వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 


నెదర్లాండ్స్‌లో అక్కడి రహదారులపై కమర్షియల్ ప్లయింగ్ కోసం అధికారిక ఆమోదం లభించింది. పాల్-వి లిబర్టీగా పిలిచే  ‘ఎయిర్‌ కార్‌' ను డచ్ కంపెనీ పాల్-వి రూపొందించింది. ఎగిరే కారు మనం ఊహించినట్టు గానే చిన్న హెలికాప్టర్ , ఏరోడైనమిక్ కారు (పైన మడతపెట్టే ప్రొపెల్లర్‌తో) లా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్‌లో గంటకు 99 మైళ్లు,  ఫ్లైట్ మోడ్‌లో దీని గరిష్టంగా గంటకు 112 మైళ్లు వేగాన్ని అందుకుంటుంది. 

లిబర్టీ ఒక గైరోకాప్టర్, అంటే పైన ఉన్న రోటర్లుకారును పైకి లేపుతాయి.  ఇందుకు కారు వెనుక భాగంలో ఒక ప్రత్యేక ప్రొపెల్లర్ ఇంజిన్ ఉంటుంది.  కారు హెలికాప్టర్ లాగా కదిలినా,  వర్టికల్ గా  టేకాఫ్  అవ్వలేదు. టేకాఫ్‌కు కనీసం 590 అడుగుల పొడవు, ల్యాండింగ్‌కు 100 అడుగుల పొడవు రన్‌వే అవసరం. అయితే డ్రైవింగ్ మోడ్‌లో ఉండగా రోటర్లను  మడవటం అనే సాధారణ విషయం కాదు. భవిష్యత్ మోడళ్లలో లిబర్టీ ఇంజనీర్లు దీనిపై దృష్టిపెడుతున్నారు.  


పరిమిత ఎడిషన్ గా 90 పయనీర్ వాహనాలను విక్రయించింది. ప్రీ-టాక్స్ ధర ట్యాగ్‌తో 599,000 డాలర్లుగా (4.47 కోట్ల రూపాయలు)దీని ధరను నిర్ణయించింది. మంచి డిజైన్, సొగసుగా తయారుచేయడానికి ఇటాలియన్ డిజైనర్లను నియమించుకుంది. అనంతరం స్పోర్ట్ మోడల్ తదుపరి  399,000 డాలర్లకు విక్రయించనుంది. అయితే నెదర్లాండ్స్ వెహికల్ అథారిటీతో నాణ్యతా పరీక్షల తరువాతగానీ కారు ఉత్పత్తిని ప్రారంభించమని కంపెనీ తెలిపింది.  ప్రస్తుతం అధికారిక లైసెన్స్ తో ఒకటి మాత్రమే నడుస్తోందని వెల్లడించింది. 2022 లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీతో ధృవీకరణను  అందుకోవాలని యోచిస్తోంది.

అటు స్లోవేకియాకు చెందిన క్లెయిన్‌ విజన్‌ అనే కంపెనీ ఎగిరే కారును అభివృద్ధి చేసింది. విజయవంతంగా పరీక్షించిన ఈ కారు బరువు 1,100 కిలోలు. 200 కిలోల వరకు మోసుకెళ్లగలదు. నవంబర్‌లో నిర్వహించనున్న ‘చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌'లో రెండు మోడళ్లను ప్రదర్శనకు పెట్టనున్నారు. కారు వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రావచ్చు. ఈ కారు 2021 కల్లా అందుబాటులోకి రానుందనీ..ఈ కారు భూమికి 1500 అడుగుల ఎత్తులో గంటకు 620 కిమీల వేగంతో కారు దూసుకెళ్తుందని క్లెయిన్‌విజన్ సంస్థ వెల్లడించింది.ఈ కారును రెండు రకాల వెర్షన్లలో విడుదల చేయనుంది సదరు సంస్థ. వీటిలో ఒకటి టూసీటర్, రెండోది ఫోర్‌ సీటర్. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుందట.

Visit for more: https://www.pal-v.com/


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top