Thursday, October 1, 2020

బడులు తెరవడంతో చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు


వాషింగ్టన్ : బడులు తెరవడంతో చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు

పాఠశాలలను పునః ప్రారంభించడం, క్రీడలు, ఇతర కార్యక్రమాలకు అనుమతించడం.. వంటి కారణాలతో అమెరికా వ్యాప్తంగా చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఏప్రిల్ లో కరోనా కేసుల్లో చిన్నారుల సంఖ్య 2 శాతం ఉండగా, ప్రస్తుతం ఆది 10 శాతానికి చేరుకుంది.

చిన్నారుల్లో కరోనా కేసులు పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యక్షులు డాక్టర్ షల్లీ గోజా తెలిపారు.

పొడిగిస్తారా.. ముగిస్తారా..

𒊹︎︎︎ పీఆర్సీ నివేదిక కమిటీ గడువు పూర్తి

𒊹︎︎︎ ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు

కృష్ణాజిల్లా: ముదినేపల్లి :

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల వేతన స్థిరీకరణ కమిటీి నివేదిక సమర్పణకు ఇచ్చిన గడువు బుధవారంతో పూర్తయింది.అయిదేళ్లకోసారి వీరికి రాష్ట్ర ప్రభుత్వం వేతన స్ధిరీకరణ చేస్తుంది. ఇది మొదట్లో కచ్చితంగా నూతన పీఆర్సీ అమలు తేదీ నుంచి కొనసాగేది.

కొన్నేళ్ల నుంచి వేతన స్ధిరీకరణ తేదీ నుంచి కాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను బట్టి ఏడాది లేదా రెండేళ్ల తర్వాత అమలు చేస్తున్నారు.11వ పీఆర్సీపై కమిటీ వేసి అమలును గత ప్రభుత్వం మరచిపోయింది.ఈలోగా ప్రభుత్వం మారి.. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగానే మధ్యంతర భృతి 27శాతం ఇచ్చారు.పీఆర్సీ నివేదికకు సంబంధించి నాలుగోసారి పొడిగించిన గడువు బుధవారంతో ముగిసింది.దీని అమలుకు ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.

 ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించకుండా.. అక్టోబరు మొదటి వారంలోనే నివేదికను కమిటీ సమర్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు సంతృప్తికర స్థితిలో పీఆర్సీ ప్రకటిస్తే ఖజానాపై రూ.వేలకోట్ల భారం పడుతుందని నిపుణుల అభిప్రాయం.ఇప్పటికే రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. మరింత జాప్యం చేస్తే తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛనర్లు వేచి చూస్తున్నారు.

DA ల ఊసే లేదు

కరోనాకు ముందు బకాయి ఉన్న మూడు డీఏలు చెల్లింపుపై ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఉగాదికి రెండింటిని చెల్లించటానికి సుముఖత వ్యక్తం చేశారు.కరోనా తరవాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో పాటు కేంద్రప్రభుత్వం డీఏలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు విడుదల చేయటంతో రాష్ట్రం కూడా ప్రస్తుతానికి కరవు భత్యం ఊసెత్తడం లేదు.కనీసం రెండు డీఏలు అయినా ఇప్పించాలని ఉద్యోగులు సంఘ నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

𒊹︎︎︎ 50శాతం తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

 పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 27శాతం మధ్యంతర భృతి ఇచ్చారు.ఫిట్‌మెంట్‌ కూడా 50 శాతానికి పైగా ఇస్తారని భావిస్తున్నాం.దాని అమలును సాగదీయకుండా అమలు చేయాలి.నూతన పీఆర్సీలో ఆటోమేటిక్‌ అడ్డాన్స్‌మెంట్‌ పథకాన్ని 5,10, 15,20, 25 ఏళ్లకు వర్తింపజేయాలి.

- బి.రాజేంద్రప్రసాద్‌, ఏపీటిఎఫ్ జిల్లా కార్యదర్శి

𒊹︎︎︎ డీఏలు చెల్లించాలి

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏలు విడుదల చేయాలి. పీఆర్సీ అమలు కూడా 1 జులై 2018 నుంచి ఆర్థిక లబ్ధి చేకూర్చేలా చూడాలి.కమిటీ గడువు పొడిగించుకుంటూ వెళ్లటం సరికాదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. డీఏల చెల్లింపు నూతన నిష్పత్తిలోనే వర్తింపజేయాలి.

-గుంజా మాధవరావు, మండల పరిషత్తు ఏవో, ముదినేపల్లి

అలా..ఎలా.. ? పాఠశాల సముదాయాల ఏర్పాటు తీరుపై విమర్శలు

 పలుచోట్ల వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు

 విజయనగరం

 జిల్లాలో పాఠశాల సముదాయాల (స్కూల్‌ కాంప్లెక్స్‌) ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారుతోంది.గతంలో ఉన్న సముదాయాలను విలీనం చేసి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠశాల సముదాయాలను టీచింగ్‌ లెర్నింగ్‌ కేంద్రాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మండలానికి ఇప్పుడున్న అయిదు లేక ఆరు సముదాయాలను మూడు లేక నాలుగుకి పరిమితం చేయనున్నారు.

 అధికారులు అందుబాటులో, అందరికీ అనుకూలంగా ఉన్న వాటిని కాకుండా.. రవాణా, ఇతర సమస్యలు ఉన్నచోట ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒకటి, రెండుచోట్ల రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం.ఈ విషయంలో కొందరు ఎంఈవోల తీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారుఇప్పటికే విద్యాశాఖ దృష్టికి కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాతపూర్వకంగా తీసుకెళ్లారు.

 జిల్లాలో గతంలో 220 పాఠశాల సముదాయాలు ఉన్నాయి.వీటి సంఖ్యను తగ్గించడంతో కనిష్ఠంగా 102, గరిష్ఠంగా 136 మధ్య సముదాయాలే ఉండనున్నాయి.

కమిటీలు నామమాత్రమే..:

మండల స్థాయిలో ఎంఈవో కన్వీనరు, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుడు ఛైర్మన్‌గా కమిటీలో ఉంటారు యూపీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు ఒక సీఆర్పీ కమిటీ సభ్యులుగా ఉంటారు.

కమిటీయే సముదాయాలను ఏర్పాటు చేస్తోంది.

జిల్లా స్థాయిలో డీఈవో ఆధ్వర్యంలో ఏఎంవో కన్వీనరు, జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు, ఎంఈవో(డివిజన్‌ నుంచి ఒకరు మాత్రమే) గల కమిటీ పరిశీలన చేసి, నూతన సముదాయాలను అధికారికంగా ప్రకటిస్తారు.ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.కొందరు హెచ్‌ఎంలు వారికి అనుకూలంగా వాటిని ఎంపిక చేసినట్లు ఆరోపిస్తున్నారు.

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top