Wednesday, September 23, 2020

టీచర్ల బదిలీ ఖాయం


వారం రోజుల్లోగా ఉత్తర్వులు

కమిషనరేట్లో ప్రత్యేకంగా విభాగం

ఇప్పటికే ఖాళీలను గుర్తించిన డీఈఓలు

సర్దుబాటుపైనా స్పష్టత వచ్చే అవకాశం

 ❇️అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ,జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయల బదిలీల అంశంపై విద్యాశాఖ చేపట్టిన కసరత్తు చివరిఅంకానికి చేరుకుంది.

 ❇️ఇప్పటికే జిల్లాలవారీగా డీఈఓలుఖాళీలతోపాటు లాంగ్ స్టాండింగ్ వివరాలను పాఠశాల విద్యాశాఖకు పంపించారు. ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో డీఈఓలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు, సర్దుబాటుపై అనుమానాల నివృత్తి చేయడంతోపాటు అన్నింటిని ఆన్లైన్ చేసేందుకు విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

 ❇️పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చిన్నవీరభద్రుడుఆదేశాల మేరకు ఎన్‌సీఈఆర్‌టీ ఐటీ సెల్ కు చెందిన సీహెవీ రమేష్ కుమార్, డైరెక్టరేట్ లోని జూనియర్ అసిస్టెంట్ టీ శ్రీహరిని ఆ విభాగంలో నియమించారు. 

❇️ఉపాధ్యాయ బదీలు, సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆవిభాగం పని చేస్తుందని చినవీరభద్రుడు అన్ని జిల్లాల డీఈఓలకు సర్క్యులర్స్ పంపించారు. 

❇️ఖాళీలు, సర్దుబాటు పై ఏమైనా అనుమానాలు ఉంటే డీఈఓలు ప్రత్యేక సెల్ లోని సిబ్బందితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు.

 ❇️అలాగే బదిలీకి అర్హత ఉన్న ఉపాధ్యాయులలో ఎవరెవరు స్పౌజ్అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, టీచర్స్ ఏ గ్రేడ్ లో(HRA ఆధారంగా) ఉన్నారు, వారికి ఎన్ని పాయింట్లు వస్తాయోనన్న అంశాలపైనా ప్రత్యేకంగా కసరత్తు జరుగుతోంది.

 ❇️మరోవైపు డీఎస్సీ - 2018 SGT  అభ్యర్థులకుపోస్టింగ్స్ ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి డాక్టర్ఆదిమూలపు సురేష్ మంగళవారం ప్రణాళికను విడుదల చేశారు. 

❇️ఆ సమయంలోనే వారం రోజుల్లోగా ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

❇️డీఎస్సీ - 2018 అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తున్నందున తాజాబదిలీలలో ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పైనా స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.మ రోవైపు విద్యాశాఖ ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ప్రాథమికంగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. 

❇️అన్ని జిల్లాల డీఈఓలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అనంతరమే విద్యార్థి, ఉపాధ్యాయులు నిష్పత్తిని ఖరారు చేశారు. ప్రాథమిక పాఠశాలలో 60 మందిలోపు విద్యార్థులుంటే రెండు SGT టీచర్ పోస్టులుంటాయనివి ద్యాశాఖ తెలిపింది.

 ❇️అలాగే 61 నుంచి 90 మంది ఉంటేముగ్గురు, 91 నుంచి 120 మందికి నలుగురు, 121 నుంచి 150 మందికి ఐదు పోస్టులను మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

 ❇️విద్యార్థుల సంఖ్య151 నుంచి 200 ఉన్న స్కూళ్లకు అదనంగా హెడ్ మాస్టర్పో స్టును మంజూరు చేస్తారు. 

❇️విద్యార్థుల సంఖ్య 200 పైన ఉన్న స్కూళ్లలో ప్రతి 40 మందికి ఒక SGT పోస్టును మంజూరు చేయాలని భావిస్తున్నారు. జిల్లాల్లో మిగిలిన ఉపాధ్యాయులు అవసరమైన స్కూళ్లలో నియమిస్తారు.

❇️గతంలో నిర్వహించిన సర్దుబాటులో డీఈఓ పూల్ లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా అవసరమైన స్కూళ్లకు బదిలీ చేస్తారు.

 ❇️విద్యార్థుల సంఖ్య 151 దాటితేనే  LFLహెచ్ఎం పోస్టు ఉంటుందని, ఆలోపు ఉన్న స్కూళ్లలోLFL HM ను SGT గా పరిగణించనున్నారు.

*❇️ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలు వెలువడిన తర్వాతేవీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

❇️ప్రాథమికోన్నత పాఠశాలల్లో వందలోపు విద్యార్థులుంటే నాలుగు సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించనుండగా,140 దాటితే ఆరుగురు, 386-420 ఉంటే ప్రతి 35మందికి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును అదనంగా ఇస్తారు

❇️ఉన్నత పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులనుఉంచాలని విద్యాశాఖ భావిస్తోంది.

❇️హైస్కూళ్లలో 240 మంది విద్యార్థులుంటే నాలుగు పోస్టులు,280లోపుంటే ఐదు, 320కి ఆరు, 360కి ఏడు, 400 మంది విద్యార్థులుంటే ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులుఉం చేలా చర్యలు చేపడుతున్నారు.

 ❇️మూడు నెలల క్రితమే ఉపాధ్యాయుల బదిలీలు జరగాల్సి ఉండగా, కరోనాకా రణంగా ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. 

❇️మరోవైపు బదిలీల కటాఫ్ తేదీపైనా ఒక స్పష్టత ఇవ్వాలని  ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING/COVID NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top