Thursday, August 6, 2020

UPSC నుంచి మరో నోటిఫికేషన్‌.. 344 ఖాళీలు


త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీస్ (సీడీఎస్‌) ఎగ్జామ్‌-2 నోటిఫికేష‌న్‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 344 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్ర‌క్రియ ఆగ‌స్టు 5 సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 25, 2020 ముగుస్తుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. సీడీఎస్ ప‌రీక్ష‌ను యూపీఎస్సీ ప్ర‌తి ఏడాది రెండుసార్లు నిర్వ‌హిస్తుంది. పూర్తి వివరాలకు www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.



మొత్తం పోస్టులు: 344

ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ- డెహ్రాడూన్‌: 100 పోస్టులు

ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ- ఎజిమ‌ల‌: 26 పోస్టులు

ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీ- హైద‌రాబాద్‌: 32 పోస్టులు

ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ- చెన్నై (మెన్‌): 196 పోస్టులు

ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ- మ‌ద్రాస్ (ఉమెన్‌): 17 పోస్టులు

విద్యార్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 25, 2020

దరఖాస్తు ఫీజు: రూ.200

ద‌ర‌ఖాస్తుల‌కు ఉప‌సంహ‌ర‌ణ‌: సెప్టెంబ‌ర్ 1 నుంచి 7 వ‌ర‌కు

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌: ప‌రీక్ష‌కు మూడు వారాల ముందు

పరీక్ష తేది: నవంబర్‌ 8, 2020

వెబ్‌సైట్‌: www.upsc.gov.in/

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top