ఇకపై దేశీ TikTok ఇదే..Chingari app లక్షల్లో డౌన్ లోడ్


కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత...ఆ స్థాయిలో వీడియో యాప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి అనేక చైనా యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేశారు. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న 59 Chinese Apps Ban నిర్ణయంతో చైనాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. అయితే టిక్ టాక్ ఫాలోయర్లకు ఇప్పుడు దేశీయ యాప్ CHINGARI ఆశాకిరణంగా నిలిచింది. ఈ చింగారి యాప్ ప్రస్తుతం టిక్‌టాక్‌ను రీప్లేస్ చేసేలా కనిపిస్తోంది.భారతదేశంలో తయారైన చింగారీ యాప్ ఇప్టపికే లక్షలాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వార్తల ప్రకారం, చింగారి యాప్ ఛత్తీస్‌గడ్ డెవలపర్ రూపొందించిన ఇండియన్ టిక్‌టాక్ వెర్షన్, ఇది ప్రస్తుతం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందింది.

ఒరిస్సా, కర్ణాటక డెవలపర్లు కూడా ఈ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారని చింగారి చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ సుమిత్ ఘోష్ అన్నారు. ఈ యాప్‌ను ఇప్పటివరకు సుమారు 25 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. చింగారి యాప్‌ను గూగుల్ ప్లేలో 2018 లో విడుదల చేశారని, భారతీయ వినియోగదారుల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు ఘోష్ తెలిపారు.

Chinese App Tik Tok Ban తర్వాత భారతీయ వినియోగదారుల నుంచి Chinagari App అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఘోష్‌తో పాటు, ఒరిస్సాకు చెందిన బిస్వాత్మ నాయక్, కర్ణాటకకు చెందిన సిద్ధార్థ్ గౌతమ్ కూడా చింగారి యాప్‌ను డెవలపర్లుగా ఉన్నారు.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad