Friday, July 3, 2020

Paytm నుంచి flipkart : చైనా పెట్టబడులతో భారతీయ యాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత దృష్ట్యా  అత్యంత పాపులర్ అయిన టిక్‌టాక్, UC బ్రౌజర్‌తో సహా 59 యాప్స్ చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన, గల్వాన్ లోయలో చైనా దళాలతో 20 మంది భారత ఆర్మీ సిబ్బందిపై దాడి చేయడంతో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దేశీయ యాప్‌లతో పాటు, భారతీయ స్టార్టప్‌లు, డిజిటల్ టెక్ కంపెనీలైన పేటీఎం నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు అనేక రంగాలలో చైనా పెట్టుబడులు పెట్టాయి. భారత ఆర్థిక వ్యవస్థలో చైనా లోతుగా పాతుకుపోయిందనడంలో సందేహం అక్కర్లేదు.

ఒక్క 2019 ఏడాదిలోనే చైనా టెక్ కంపెనీలు ఇండియాలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి సుమారు 19 ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాయని విదేశీ పెట్టుబడి మానిటర్ ‘FD Markets’ వెల్లడించింది. చైనా పెట్టుబడి దిగ్గజాలు అలీబాబా గ్రూప్, Tencent, Steadview క్యాపిటల్, Didi Chuxing భారతదేశంలోని 30 Unicorn కంపెనీలలో 18కి  పైగా పెట్టుబడులతో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. ఇండియాలో ఈ 18 Unicorn కంపెనీలు బిగ్‌బాస్కెట్, జోమాటో, Delhivery, Byju’s Flipkart, Make my trip, Paytm వరకు 3,500 మిలియన్ డాలర్ల వరకు చైనా పెట్టుబడులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. అంతగా చైనా తన మార్కెట్‌ను భారతదేశంలో విస్తరించింది.

చైనా పెట్టుబడి పెట్టిన యాప్స్ జాబితా :

1. Paytm (Pay Through Mobile) :
2010లో విజయ్ శేఖర్ శర్మ ఈ పేటిఎమ్ యాప్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రీపెయిడ్ మొబైల్, DTH, Dat Card కోసం ఆన్‌లైన్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌గా పేటీఎం ప్రారంభమైంది.  ఈ పేటీఎం యాప్ కోసం వ్యవస్థాపకుడి నుంచి 2 మిలియన డాలర్ల ప్రారంభ పెట్టుబడితో మొదలైంది. ప్రస్తుతం తన సొంత సంస్థలో 20శాతం కన్నా తక్కువ వాటా కలిగి ఉన్నారు వ్యవస్థాపకుడు విజయ్ శర్మ. చైనా టెక్నాలజీ దిగ్గజం అలీబాబా పేటీఎంలో 40శాతం వాటాను కలిగి ఉంది. అలీబాబా, SAIF భాగస్వాములు ఇద్దరూ కలిసి Paytmలో 60శాతం వాటా పెట్టారు. చైనీస్ ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా నుంచి నిధులు పొందిన మొదటి భారతీయ సంస్థ కూడా ఇదే. ఇప్పుడు 625 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తోంది.

2.Ola :
2010లో భవిష్ అగర్వాల్, అంకిత్ భాటి OLA యాప్ ప్రవేశపెట్టారు. 2014లో స్టీడ్‌వ్యూ క్యాపిటల్ నుంచి మొదటి చైనా పెట్టుబడిగా పొందింది. 2018లో చైనీస్ గేమింగ్ behemoth టెన్సెంట్ హోల్డింగ్స్ సాఫ్ట్‌బ్యాంక్, RNT క్యాపిటల్‌తో పాటు 1.1 బిలియన్ డాలర్ల భారీ నిధులను సమకూర్చింది. దాంతో ఒక ప్రధాన వాటాదారుగా నిలిచింది ఓలాలో 10.4శాతం వాటాను కలిగి ఉంది.

3.Swiggy :
2014లో శ్రీహర్ష మెజెటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమిని స్విగ్గి ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఓలా మొదటి సంస్థ హాంగ్ కాంగ్‌కు చెందిన SAIF పార్టనర్లతో పాటు అమెరికాకు ఆధారిత Accelతో కలిసి 2015లో తన మొదటి సంస్థాగత నిధుల్లో 2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. అప్పటి నుంచి చైనా కంపెనీలు Meituan-Dianping, Tencent Holdings and Hillhouse Capital Group 500 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఇప్పటివరకూ Swiggy మొత్తం 1.6 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టారు.

4.Hike Messenger :
స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టంట్ మెసేజ్ సర్వీసుల కోసం చైనా ఇంటర్నెట్ దిగ్గజం Tencent హోల్డింగ్స్, తైవాన్ Foxconn టెక్నాలజీ గ్రూప్ నిధులు సమకూరుస్తున్నాయి. ఈ సంస్థ  విలువ సుమారు 1.4 బిలియన్ డాలర్లు. ఇప్పటివరకు సేకరించిన మొత్తం నిధులు 261 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

5.Snapdeal :
2010లో కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ చేత ఈ Snapdeal యాప్‌ను స్థాపించారు. స్నాప్ డీల్ విలువ-కేంద్రీకృత ఆన్‌లైన్ మార్కెట్, భారతదేశం అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి.. మొత్తం 1.8 బిలియన్ డాలర్లకు సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్, కలరి క్యాపిటల్, నెక్సస్ వెంచర్స్, ఈబే ఇంక్ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఉన్నాయి.

6.BigBasket :
2011 ఏడాదిలో అభినయ్ చౌదరి, హరి మీనన్, విపుల్ పరేఖ్, V.S. సుధాకర్ బిగ్‌బాస్కెట్ స్థాపించారు. భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్, కిరాణా ఆన్‌లైన్ స్టోర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు, బిగ్‌బాస్కెట్ 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. వీటిలో ఎక్కువ భాగం విదేశీ పెట్టుబడిదారుల నుంచే నిధులు వచ్చాయి. 2018లో E సిరీస్ రౌండ్లో 300 మిలియన్ డాలర్లను సేకరించింది. ఈ కంపెనీకి సాయం చేసిన అలీబాబా.. బిగ్‌బాస్కెట్ అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. 2019 నాటికి అలీబాబా గ్రూప్ ఇప్పటికీ కంపెనీలో 26.26శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది.

7.Zomato :
2008 ఏడాదిలో దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా స్థాపించారు. భారత ఆన్‌లైన్ దిగ్గజం Info Edge నిధులు సమకూర్చింది. అలీబాబా ఆర్థిక సేవల సంస్థ  యాంట్ ఫైనాన్షియల్ 2018లో 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో Zomatoలో వాటాదారుగా ఉంది. అదే సంవత్సరం నుంచి యాంట్ ఫైనాన్షియల్ మరో 210 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. జోమాటో మొత్తం 914.6 మిలియన్ డాలర్లను సేకరించింది.

8.OYO :
2012 ఏడాదిలో 18 ఏళ్ల కాలేజీ డ్రాప్-అవుట్ రితేష్ అగర్వాల్ OYO సంస్థను ప్రారంభించారు. తన పెట్టుబడిదారుల నుంచి OYO కోసం 3.2 బిలియన్ డాలర్లను సేకరించారు. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ 48శాతం యాజమాన్యంతో మెజారిటీ వాటాదారుగా ఉంది.

9.Flipkart :
ప్రముఖ దిగ్గజ వ్యాపారులైన సచిన్, బిన్నీ బన్సాల్ సంయుక్తంగా Flipkart స్థాపించారు. ఈ ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో 81శాతం వాల్‌మార్ట్ కలిగి ఉంది. కంపెనీలో మైనారిటీ వాటాను కలిగిన చైనా పెట్టుబడిదారులు ఇప్పటికీ ఇందులో ఉన్నారు. ఇప్పటి వరకు, ఫ్లిప్‌కార్ట్ మల్టీపుల్ ఇన్వెస్టర్ల నుంచి 7.7 బిలియన్ డాలర్లను సేకరించింది. చైనా పెట్టుబడిదారుల్లో టెన్సెంట్ హోల్డింగ్స్, స్టీడ్‌వ్యూ క్యాపిటల్ పెట్టుబడిదారులకు కూడా వాటా ఉంది.

10.Make My Trip :
భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థలలో ఒకటిగా Make My Trip అవతరించింది. ఇటీవల

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

COVID-19 NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

STUDENTS EXAMS ZONE

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top