Wednesday, July 22, 2020

ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం…విప్లవాత్మక సంస్కరణలతో ముందడుగుఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతోంది. నాడు–నేడు కార్యక్రమాలతో పాఠశాలల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు నాణ్యమైన బోధన, ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణపై దృష్టి పెట్టింది. పోటీని తట్టుకునేలా భాషా పరిజ్ఞానం, నైపుణ్యం పెంపు కోసం అనేక చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. అభ్యాసం కోసం ప్రత్యేక పుస్తకాలు కూడా రూపొందించింది. మరోవైపు ఈ ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున, ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు బ్రిడ్జి కోర్సులు కూడా నిర్వహిస్తోంది. అన్నింటికీ మించి విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు.


జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు
ఆగస్టు 16, 2019 : ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ ఏర్పాటు
సెప్టెంబరు 23, 2019 : 43,257 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా విద్యా కమిటీల ఏర్పాటు. తద్వారా విద్యా హక్కు చట్టం అమల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం..
నవంబరు 14, 2019 : నాడు–నేడు : మనబడి కార్యక్రమం తొలిదశలో భాగంగా 15,715 స్కూళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పించే పనులకు శ్రీకారం. రూ.3600 కోట్లు ఖర్చు. కొత్తగా 10వ సదుపాయం కింద కిచెన్‌ షెడ్‌ ఏర్పాటుకు నిర్ణయం.
జనవరి 9, 2020 : పిల్లల్ని బడులకు పంపుతున్న తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ఆర్థిక సహాయం. దాదాపు 43 లక్షల తల్లులకు రూ.6,456 కోట్ల ఆర్థిక సహాయం. నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ.
జనవరి 21, 2020 : జగనన్న గోరుముద్ద ప్రారంభం. మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు నాణ్యమైన, పౌష్టికాహారం కోసం ప్రత్యేక చర్యలు. భోజన మెనూలో పలు మార్పులు. స్కూళ్లలో పరిశుభ్రత. నాలుగు దశల్లో పర్యవేక్షణ. మధ్యాహ్న భోజన పథకంలో ఆయాలకు జీతాలు పెంపు.


స్కూళ్లు తెరిచే నాటికి జగనన్న విద్యా కానుక..
పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్స్, మూడు జతల యూనిఫామ్స్, షూస్, సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగులతో జగనన్న విద్యా కానుక సిద్ధం. స్కూళ్లు తెరవగానే పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద కిట్‌ అందజేత. దాదాపు 40 లక్షల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక.

పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు..ఇంగ్లిషు మాథ్యమం
– ఈ విద్యా సంవత్సరం (2020–21) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాథ్యమంలో విద్యా బోధన. ఏటా ఒక్కో క్లాస్‌ పెంచుకుంటూ, వచ్చే నాలుగేళ్లలో పదో తరగతి వరకూ ఇంగ్లిష్‌ మాథ్యమంలో విద్యా బోధన.

కొత్త పాఠ్య పుస్తకాలు..
– కొత్తగా 24 పాఠ్య పుస్తకాలు రూపొందించిన విద్యా శాఖ.
– అన్ని భాషలకూ కలిపి 85 కొత్త పాఠ్య పుస్తకాలు.
– ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ అభ్యాసం కోసం 63 కొత్త వర్క్‌ బుక్స్‌.
– టీచర్ల కోసం 5 రకాల హ్యాండ్‌ బుక్స్‌.
– తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్‌ బుక్‌. స్కూలు డైరీ లాంటిది.

ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యం పెంపు..
– ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 1,11,731 మంది టీచర్లకు శిక్షణ.
– స్పోకెన్‌ ఇంగ్లిషుపై 70 వెబ్‌నార్స్‌ (ఆన్‌లైన్‌ సదస్సులు) నిర్వహణ.
– టీచర్ల స్వయం శిక్షణ కోసం ‘అభ్యాస’ యాప్‌ ప్రారంభం.
– ‘నిష్ట’ కార్యక్రమం కింద శిక్షణ కోసం 231 మంది స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ గుర్తింపు. పేర్లు నమోదు.
– మరో 1050 కీ రీసోర్స్‌ పర్సన్ల గుర్తింపు.
– మొత్తం 1.5 లక్షల టీచర్లకు ఆన్‌ లైన్‌లో శిక్షణ.
– దేశంలో ఆ విధంగా శిక్షణ ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

బ్రిడ్జి కోర్సులు…
– ఈ ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బ్రిడ్జి కోర్సుల నిర్వహణ.
– టీవీల ద్వారా ‘విద్యామృతం’ కార్యక్రమం కింద పాఠాలు.
– రేడియో ద్వారా ‘విద్యా కలశం’ కార్యక్రమంలో పాఠాలు.
– ‘విద్యా వారధి’ కార్యక్రమం కింద ఒకటి నుంచి ఆరోతరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సుకు సంబంధించి రెండు పుస్తకాలు పంపిణీ.
– 18.32 లక్షల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు పుస్తకాలు పంపిణీ.

విద్యార్థులకు హెల్ప్‌ లైన్‌.

– విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీతో.. 1800 123 123 124 కాల్‌ సెంటర్‌ జూన్‌ 27న ఏర్పాటు.

– కాల్‌ సెంటర్‌లో 200 మంది టీచర్లు.
– వీటన్నింటితో పాటు, మొబైల్‌ స్కూళ్ల ఏర్పాటు కోసం ప్రణాళిక.

SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

job news HEALTH TIPS

TRENDING

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top