Friday, July 10, 2020

15 న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..

CM-JAGAN

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 15న సమావేశం కానుంది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనుంది. పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13 సాయంత్రం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్పష్టం చేశారు. కరోనా కారణంగా కొన్ని వారాల వ్యవధి తరువాత కేబినెట్ సమావేశం జరగనుంది.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

COVID-19 NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

STUDENTS EXAMS ZONE

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top