Monday, June 29, 2020

ఆవిలింత రావడానికి అసలు కారణం...




సాధారణంగా ప్రతీ మనిషికీ ఆవిలింతలు రావడం సహజం. అందులోనూ ఒకరు ఆవిలిస్తే.. మరొకరికి రావడం కూడా మనం గమనిస్తూంటాం. ఎంత సీరియస్‌గా పని చేస్తున్నా, చదువుతున్నా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి. అయితే బాగా అలిసి పోవడం వల్ల లేక నిద్ర రావడం వల్ల ఈ ఆవిలింతలు వస్తూంటాయని పెద్దలు చెబుతూంటారు. కానీ మరి ఇలా ఆవిలింతలు రావడానికి అసలు కారణాలు ఏంటి? ఎందుకు ఇలా వస్తాయి? అన్న విషయంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

నిజానికి ఈ ఆవిలింతలు అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతాయట. అప్పుడు మొదలైన అలవాటు జీవితాంతం వదలిపెట్టదు. అసలు ఈ ఆవిలింతలు రావడానికి ముఖ్య కారణం ఆక్సిజన్ అందకపోవడమనేట. అవును మీరు విన్నది నిజమే. మెదడుకి సరిపడా ఆక్సిజన్ అందకపోవటం వల్లనే ఈ ఆవిలింతలు వస్తాయని.. శాస్త్రవేత్తలు ఎప్పుడో వెల్లడించారు. ఇప్పటికీ ఇదే చెబుతున్నారు.

మెదడుకి ఆక్సిజన్‌ను అందించడానికి శరీరం ఆవిలింతల రూపంలో అధిక మొత్తంలో గాలిని తీసుకుంటుందట. దీంతో మెదడు చురుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక మనిషి తన జీవిత కాలంలో 400 గంటలు ఆవలిస్తాడట. అంటే 2.4 లక్షల సార్లు ఆవిలిస్తారన్నమాట. మరి ఆవలిస్తారన్నమాట. అలాగే ఈ ఆవిలింతలు కేవలం మనుషులకు కాదు జంతువులకు కూడా వస్తాయి

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top