Saturday, June 6, 2020

ఇంట్లోనే అల్లం, వెల్లుల్లి పెంచాలనుకుంటున్నారా.. ఇలా ట్రై చేయండి..
ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజాదరణ పొందుతున్న అల్లం, వంటశాలలలో medicinal మరియు  culinaryప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది . ఇది Antibacterial మరియు  Anti-Inflammatory లక్షణాలతో పాటు శక్తివంతమైన జీర్ణ సహాయంగా ఉపయోగించబడుతుంది. మన ఇంటి తోట లో పెంచుకోవడం చాల సులువు 

ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆహారం విషయంలోనూ ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం అందరూ ఆహార పదార్థాలను నిల్వ చేయడం, రేషన్ సరుకుల గురించి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. ఆన్‌లైన్ డెలివరీలకి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అదేవిధంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ ఖర్చులను తగ్గించేందుకు మనం ఇంట్లోనే పెంచవచ్చు. ఇందుకు మీ బాల్కనీ, కిటికీలను కూడా వాడొచ్చు. ఇంట్లో కూరగాయలను కట్ చేసిన తరువాత వ్యర్ధాలను పడేస్తాం. వాటినే ఉపయోగించి ఇంట్లోనే చెట్లు పెంచొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాక్టీరియాతో పోరాడే అల్లం..

అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి అల్లం మన శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇనెఫెక్షన్లను తగ్గించడంలో అల్లం సాయపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం అల్లం అనేక బ్యాక్టీరియాలతో పోరాడగలదని సూచిస్తున్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అల్లాన్ని ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఇలా పెంచండి..
అల్లం రూట్ నాటడానికి నిస్సార కందకాన్ని తవ్వండి. రైజోములు నేల ఉపరితలం కంటే ఒక అంగుళం కంటే ఎక్కువ ఉండకూడదు. మొక్క అడ్డంగా పెరుగుతుంది కాబట్టి ఇతర మొక్కల నుండి చాలా స్థలం అవసరం. అల్లం రూట్ ఉంచండి, తద్వారా పెరుగుతున్న బిందువులు నేల ఉపరితలం వైపు అతుక్కుంటాయి మరియు కందకం మీద మట్టిని శాంతముగా తగ్గించండి. రెమ్మలు కొన్ని వారాలలో ఉద్భవించి 4 నుండి 5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి.

మీ దగ్గర అల్లం ఉందా? ఒక అల్లం ముక్కని తీసుకొని దాన్ని చిన్నదిగా విరిచి మట్టిలో పెట్టండి . దీనికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండండి. తగినంత సూర్యరశ్మి తగిలేలా కిటికీ దగ్గర ఉంచండి. ఇలా చేస్తే మీరు ఒక వారం తర్వాత కొత్త మొలకలు వస్తాయి. ఇలా పెరిగిన అల్లంని మీరు వాడుకోవచ్చు..

వైరస్‌ని దూరం చేసే వెల్లుల్లి..ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. ఇది కూరలకు రుచిని మాత్రమే కాదు. అనేక ఆరోగ్యప్రయోజనాలతో నిండి ఉంది . వెల్లుల్లి వివిధ వ్యాధుల నివారణకు, చికిత్స ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియా సంక్రమణతో పోరాడటానికి ఒక ప్రభావవంతమైన ఔషధంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇవి బ్యాక్టీరియాను, వైరల్‌ను, ఫంగల్, ఈస్ట్, వార్మ్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది . ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు కలిగిన వెల్లుల్లిని ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లిని ఇలా పెంచండి..
వెల్లుల్లి పెంచడం చాలా సులభం. దీని కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవసరం. కొన్ని వెల్లుల్లి రెబ్బలను మట్టిలో నాటాలి. వెల్లుల్లికి ప్రత్యక్ష సూర్యకాంతి పుష్కలంగా అవసరం, కాబట్టి దాన్ని రోజంతా ఎండలో ఉంచండి. కొత్త వెల్లుల్లి రెబ్బలను నుంచి మొలకలు వచ్చిన తర్వాత, వాటిని కత్తిరించండి. ఈ మొక్కల్లో నుంచి వెల్లుల్లి వస్తుంది. ఈ ఆకులను సూప్‌కి సూపర్బ్ టేస్ట్‌ని ఇస్తుంది.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRANSFERS 2020

DONWLOAD TRANSFR ORDERS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top