Saturday, June 27, 2020

ఇకపై పర్మనెంట్ లేదు.. అంతా పార్ట్‌టైమ్! నిబంధనలు రూపొందిస్తున్న కేంద్రం...కరోనా వైరస్ మానవాళి జీవితాల్లో అనేక మార్పులు తెచ్చింది. ప్రపంచమంతా ఒక్కసారిగా అతిపెద్ద కుదుపుకు లోనయింది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేసిన అంశం లేదంటే అతిశయోక్తి లేదు. దీంతో వ్యవహారాల్లో, ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కనీసం కలలో కూడా జరుగుతాయా అనుకున్న మార్పులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా చాలా మార్పులు చూడబోతున్నాం. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే పధ్ధతి పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే వర్క్ ఫ్రొం హోమ్ అనే కాన్సెప్ట్ వెల్లువలా వచ్చిపడింది. ఒకప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితం కాగా... ఇప్పుడది అనేక రంగాలకు చేరువయింది. సాధారణ మీటింగుల స్థానే వర్చువల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మనిషి ఒక్క సారి ఆలోచించటం ప్రారంభించిన తర్వాత ప్రతి విషయంలోనూ పరిణామం చెందుతూనే వస్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా మరో విప్లవాత్మక పరిణామం సంభవించబోతోంది

గంటలు... రోజుల లెక్కన... 
త్వరలోనే పర్మనెంట్ జాబ్స్ అనేవి కనుమరుగు కానున్నాయి. అదే సమయంలో పార్ట్ టైం జాబ్స్... లేదా కాంట్రాక్టు జాబ్స్ మాత్రమే ఉండనున్నాయి. పర్మనెంట్ జాబ్స్ లో ఉండే భద్రత, వీటిలో ఉండదు. కానీ, మారుతున్న పరిస్థితుల కారణంగా ఒక కంపెనీకి ఒక స్కిల్ ఉన్న ఉద్యోగితో నెల, రెండు నెలలు అవసరం ఉంటె... అంత పనికి మాత్రమే కాంట్రాక్టు కుదుర్చుకుని పని పనిపూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో గంటల లెక్కన, రోజుల లెక్కన శాలరీ చెల్లిస్తారు. ఇది ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొంత వరకు అమల్లో ఉంది. కానీ, వర్క్ ఫ్రొం హోమ్ కాన్సెప్ట్ లాగానే, కాంట్రాక్టు విధానం కూడా బాగా ప్రాచుర్యం పొందనుంది. ఒక వ్యక్తి కి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలంటే కంపెనీకి చాలా భారం అవుతోంది. పని ఉన్న లేకున్నా వేతనం చెల్లించాలి. అలాగే ఇతర భత్యాలు కూడా చెల్లించాలి. లేదంటే కార్మిక చట్టాలతో వచ్చే చిక్కులు అనేకం. కానీ, కొత్త పద్ధతి లో వాటి బాధలు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే యూజ్ అండ్ త్రో అనే మోడల్ జాబ్స్ అన్నమాట. పని ఉన్నంత వరకే ఉద్యోగం. తర్వాత గుడ్ బై చెబుతారన్నమాట.

నిబంధనలు రూపొందిస్తున్న కేంద్రం... 
కాంట్రాక్టు జాబ్స్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ద్రుష్టి సారించినట్లు సమాచారం. కాంట్రాక్టు జాబ్ అయినప్పటికి... సదరు ఉద్యోగికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు అందిలే వీటిని రూపొందిస్తున్నట్లు ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఒక సమావేశంలో వెల్లడించారు. దీంతో, ఇక ప్రభుత్వమే లాంఛనంగా పార్ట్-టైం జాబ్స్ ను ప్రోత్సహించబోతోందని స్పష్టమవుతోంది. ప్రోవిడెంట్ ఫండ్, మెడిక్లైయిం సదుపాయం సహా ఇతర అన్ని సౌకర్యాలు ఒక పూర్తి స్థాయి ఉద్యోగికి లభించేవన్నీ పార్ట్ టోమ్ జాబ్స్ వారికి కూడా దక్కనున్నాయి. దీంతో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఎక్కువగా ఉండకుండా చూడవచ్చు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించిన తర్వాత కొత్త ఉద్యోగ చట్టం కూడా తీసుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపై వాటి ఆధారంగా దేశంలో కొత్త జాబ్ కల్చర్ ప్రారంభం కానుంది.

0 comments:

Post a Comment

SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING/COVID NEWS

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top