Thursday, April 22, 2021

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోబ్రియాల్ నిషాంక్ కరోనా


 

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోబ్రియాల్ నిషాంక్ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని బుధవారం ఆయన వెల్లడించా రు. 

ఇటీవల తనకు సమీపంగా మెలిగిన వారంతా వైద్య పరీక్షలు చేయించు కోవాలని కోరారు. ట్విటర్ వేదికగా పోబ్రియాల్ స్పందిస్తూ.. 'నాకు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం చికిత్స తీసు కుంటున్నాను. ఇటీవల నన్ను కలుసుకు న్న వారంతా స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలని, కొద్ది రోజుల పాటు హోమ్ క్వారెంటైన్లో ఉండండని కోరు తున్నాను.. " అని పేర్కొన్నారు. 

కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాశాఖ కార్యకలాపాలను యధాతథంగా కొన సాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలి


 


రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో సీపీఎం

అమరావతి, ఆంధ్రప్రభః రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో విద్యాలయాలన్నింటికీ సెలవులు ప్రకటించాలని, పది, ఇంటర్తో సహా అన్ని పరీక్షల ను వెంటనే వాయిదా వేయాలని, పరిస్థితి అదుపు లోకి వచ్చాక పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సీపీఎం ప్రభుత్వానికి సూచించింది. బుధవారం సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు వై. వెంకటేశ్వరావు అధ్యక్షతన ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శాఖలు అప్రమతంగా ఉంటూ స్థానికంగా ఎక్కడిక్కడ ప్రజలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటికే ఉపాధి పోయి, ఆదాయాలు తగ్గి నానా యాతన పడుతున్న ప్రజానీకం మరోసారి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్ట డంలో, వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించడంలో విఫలమ య్యాయన్నారు. . మరణాల సంఖ్య కూడా అసా ధారణంగా పెరుగుతోందని, గతం కన్నా వ్యాధి తీవ్రత పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. టెస్ట్ చేసిన వెంటనే 24 గంటల్లోగా ఫలితాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సేవలను ఉపయోగించుకొని రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల కు తగినంత నిల్వలుండే విధంగా ఆక్సిజన్ సరఫరా చేయా లని కోరారు. ఉపాధి కూలీలకు పనితో నిమిత్తం లేకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ ఇంటర్ పరీక్షల పై ఈ రోజే కీలక నిర్ణయం


 


అమరావతి: సెకండ్‌ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ ఇటు వైరస్‌బారిన పడుతున్నవారితో పాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ రోజే మంత్రివర్గ ఉససంఘం భేటీ కానుంది. మంత్రి ఆళ్ల నాని సారథ్యంలో రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్‌పై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య నిపుణుల నియామకం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మరియు 10 వ తరగతి ,ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం పైనా.. రాష్ట్రంలో ఆంక్షల విధింపు అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

Wednesday, April 21, 2021

CHECK YOUR MASTER DATA DETAILS IN FINANCE PORTAL


DDO LOGIN తెలియకున్నా మీ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ కింద LINK ను COPY చేసి  LINK చివర్లో xyz ను Remove చేసి మీ DDO CODE ను TYPE చేసి DDO CODE తో ఉన్న LINK ను Browser లో PASTE చెయ్యండి.

మీ TREASURY ID Enter చేసి ... GET DETAILS పై CLICK చెయ్యండి. 

MASTER DATA లో మీ వివరాలు CHECK చేసుకోండి. 

మార్పులు / చేర్పులు ఉంటే మీ DDO గారిని సంప్రదించండి. 

( ఈ క్రింది లింక్ ద్వారా మీ మాస్టర్ డేటా వివరాలు తెలుసుకోండి)

Tuesday, April 20, 2021

PM MODI SPEACH HIGHLIGHTS: లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి


 లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ప్రధాని మోదీ పిలుపు. 

I urge the States to consider lockdowns only as the last option and focus creating on micro containment zones: PM Modi 


LOCKDOWN అనేది చివరి అస్త్రం గా మాత్రమే వాడదాం

ఎంత కష్టం వచ్చినా  ధైర్యం కోల్పోవద్దు 

ఆక్సిజన్  కోసం ప్రత్యేక రైలు..దేశ వ్యాప్తం గా  కొరత తీరుస్తుంది

మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికి టీకా   

లాక్ డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలని ప్రధాని మోదీ అన్నారు. కరోనా నుంచి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నుంచి దేశం బయటపడడానికి ఏమేం చేయాలో ప్రధానమంత్రి సూచించారు. ముఖ్యంగా లాక్ డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలన్నారు. కరోనా నుంచి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

క‌రోనా మొద‌ట వ‌చ్చిన‌ప్పుడు అది ఏంటి? ఎలా ఎదుర్కోవాల‌ని అనే విషయంపై కూడా క్లారిటీ లేద‌న్న ప్ర‌ధాని.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయ‌న్నారు.. ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాతి గాంచిన ఔష‌ధ సంస్థ‌లు భార‌త్‌లో ఉన్నాయి. క‌రోనా రెండో ద‌శ‌లో ఔష‌ధాల కొర‌త లేదు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా టీకాలు వేస్తున్న దేశంగా మ‌న‌దేశం నిలిచింది.. ఫార్మా కంపెనీలు ఔష‌ధాల ఉత్ప‌త్తిని పెంచాయి.. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌, సీనియ‌ర్ సిటిజ‌న్లకు టీకాల ప్ర‌క్రియ పూర్తి చేశామ‌ని.. ప్ర‌స్తుతం 45 ఏళ్లు నిండినివారికి వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతుండ‌గా. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అంద‌రికీ టీకాలు అందిస్తామ‌న్నారు.. ఇక‌, లాక్‌డౌన్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాని మోడీ.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌ప్పితే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు అని.. లాక్ డౌన్ విధించే ప‌రిస్థితి తీసుకు రావొద్దు అని విజ్ఞ‌ప్తి చేశారు.. అయితే, క‌రోనాను నియంత్రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను చివ‌రి అస్త్రంగానే భావించాలి అని సూచించారు.. లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు ప్ర‌ధాని మోడీ. 

కరోనాను ఇలా అదుపు చేయొచ్చు-WHO


 

కోవిడ్ 19పై పోరాటంలో ఎవ్వ‌రి ప్ర‌య‌త్నాలు వాలు చేస్తూనే ఉన్నారు.. ఆదిలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌లే అంతూ ఫాలో అవుతూ వ‌చ్చారు.. భౌతిక దూరం, శానిటైజ‌ర్, మాస్క్ ఇలా.. క్ర‌మంగా ఆంక్ష‌లు పెరుగుతూ వ‌చ్చాయి.. అయితే, తొలి ద‌శ ముగిసి.. రెండో ద‌శ‌, మూడో ద‌శ‌.. ఇప్పుడు వ‌ణుకుపుట్టిస్తోంది..  ఈ స‌మ‌యంలో.. క‌రోనా ఇలా క‌ట్ట‌డి చేయొచ్చు అంటూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది డ‌బ్ల్యూహెచ్‌వో..  మ‌హ‌మ్మారి కట్టడి కోసం అవసరమైన వనరులను నిష్ఫాక్షికంగా పంపిణీ చేస్తే క‌రోనాను కొద్ది నెలల్లోనే అదుపులోకి తేవొచ్చు అని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్.. 

ఇక‌, కోవిడ్‌ను అదుపు చేసే సాధనాలు మన ద‌గ్గ‌ర సిద్ధంగా ఉన్నాయ‌ని వెల్ల‌డించిన డ‌బ్ల్యూహెచ్‌వో.. వాటి సాయంతో నెలల వ్యవధిలోనే కరోనాను అదుపులోకి తేవ‌చ్చు అన్నారు.. మ‌రోవైపు..  ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న వ్యాక్సినేష‌న్‌లో కొన్ని దేశాలు జాతీయవాదాన్ని అనుస‌రిస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు పర్యవరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్.. జాతీయవాదాన్ని వీడి.. కోవిడ్ కారణంగా అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న వారికే ముందుగా టీకా అందాల‌ని ఆకాంక్షించారు.. కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో ధనిక దేశంలో ఉన్నారా పేద దేశంలో ఉన్నారా అనే అంశం ప్ర‌భావితం చేయ‌కూడ‌ద‌న్న ఆమె.. నైతికంగా ఇదే సరైన చర్యగా తెలిపారు.

LIC Paytm: LIC డిజిటల్‌ చెల్లింపుల కోసం PAYTM తో ఒప్పందం


 LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం.

కరోనా విజృంభణతో అంతా డిజిటల్‌ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్‌ సర్వీసులను అందిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు నేరుగా తమ పాలసీ అమౌంట్‌ను పేటీఎం ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది. పాలసీదారులకు విస్తృత శ్రేణి డిజిటల్‌ చెల్లింపుల సేవలను అందించాలనే ఉద్దేశంతో పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. కాగా, ఎల్‌ఐసీ ఇంతకు ముందే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అప్పుడు అన్ని పేమెంట్స్‌ ఆప్షన్‌ అందించలేదు. కానీ ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందంతో అన్ని పేమెంట్‌ ఆప్షన్స్ డిజిటల్‌ మోడల్‌లకు మార్చింది.

ప్రస్తుతం ఎల్‌ఐసీ ప్రీమియంలను పేటీఎం ద్వారా చెల్లించేందుకు వివిధ బ్యాంకుల యూపీఐ ఛానెల్‌ను లేదా వాలెట్లను ఉపయోగించుకోవచ్చు. అయితే దాదాపు 17 చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లు ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వేలంలో పాల్గొనగా, చివరకు పేటీఎం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2020లో కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి సమయంలో రూ.60 వేల కోట్ల విలువైన ప్రీమియంలను ఒక్క డిజిటల్‌ మోడ్‌ ద్వారానే పాలసీదారుల నుంచి వసూలు చేసింది. కాగా, ఎల్‌ఐసీ ప్రస్తుతం ఎనిమిది కోట్ల పాలసీదారులను కలిగి ఉంది. వారందరికీ డిజిటల్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతోనే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా ఉధృతి మరింత పెరుగుతుండటంతో ఎల్‌ఐసీ పాలసీదారుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

కరోనాతో పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు

ఇదిలా ఉండగా, కరోనాతో ఎల్‌ఐసీ డెత్‌ క్లామ్‌లు కూడా భారీగా పెరిగిపోయాయి. రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌ డీఏకు ఎల్‌ఐసీ ఇటీవల అందించిన డేటా ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య డెత్‌ క్లాయిమ్‌లు 8 లక్షలను దాటాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్టే డెత్‌ క్లెయిమ్‌లు 21 శాతం మేర పెరిగాయి. ఇంత తక్కువ కాలంలో భారీ ఎత్తున డెత్‌ క్లాయిమ్‌లు రావడంతో ఎల్‌ఐసీ చరిత్రలో ఇదే మొదటిసారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కరోనాతో చాలా మంది మృత్యువాత పడుతుండటంతో డెత్‌ క్లెయిమ్‌ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని ఎల్‌ఐసీ చెబుతోంది. ఇవన్నీ ఫస్ట్‌వేవ్‌ కేసులేనని, సెకండ్‌ వేవ్‌లో డెత్‌ క్లెయిమ్‌ కేసులు మరింగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top